అయోమయంలో ఎక్సైజ్‌ ఎస్సైలు

byసూర్య | Sun, Jun 06, 2021, 11:12 AM

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా ప్రత్యక్ష ఎంపిక విధానం "డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌" ల ఎంపికైన 284 మంది ఎక్సైజ్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కొన్నేళ్లుగా వీరికి శాశ్వత పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. టీఎ్‌సపీఎస్సీ జారీ చేసిన 2015లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా 284మంది ఎక్సైజ్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్లు ఎంపికయ్యారు. 2017లో సర్టిఫికెట్ల పరిశీలించి, 2019లో ఇంటర్వ్యూలు నిర్వహించి, 2020మార్చిలో వీరందరినీ ఎక్సైజ్‌ స్టేషన్లు, ఎక్సైజ్‌ అకాడమీకి తాత్కాలికంగా అటాచ్‌ చేశారు. స్టేషన్లకు అనుబంధంగా కొనసాగాలని ఆదేశించారే తప్ప... ఎలాంటి విధులు, బాధ్యతలు అప్పగించలేదు. బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీకి అటాచ్‌ చేసిన 87 మంది పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వారికి ఐదు నెలలుగా వేతనాలు సైతం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు వేతనాలివ్వాలని, శాశ్వత పోస్టింగ్‌ల్లో నియమించాలని కోరుతున్నారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM