నిజాం కాలం నాటి చౌకీలు.. నేడు అత్యాధునిక పోలీస్‌స్టేషన్లు గా మార్పు : డీజీపీ మహేందర్‌రెడ్డి

byసూర్య | Sun, Jun 06, 2021, 11:31 AM

హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని.. నిజాం పరిపాలనలో పోలీసుల కోసం చౌకీలు నిర్మించారని, వాటిలో కొన్నింటిలో ఇప్పటికీ పోలీస్‌స్టేషన్లు నడుస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నూతనంగా నిర్మించిన ఆసి్‌ఫనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిజాం నాటి చౌకీల్లో ఉన్న పోలీస్‌ స్టేషన్లను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. నాటి చౌకీలలో కొన్నింటికి మరమ్మతు లు చేయించడం, కొత్త భవనాలను నిర్మించడం ప్రారంభించామన్నారు. నగరంలో ఉన్న 60 పోలీస్‌స్టేషన్లను ఏకరీతిన డిజైన్‌ చేసి నిర్మిస్తున్నామన్నారు. నగరంలో మరికొన్ని పోలీస్‌స్టేషన్లు నిర్మా ణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ నిజాం కాలం నాటి భవనాల్లో కొన్ని పోలీస్‌స్టేషన్లు నడుస్తున్నాయని, ప్రస్తుత అవసరాల మేరకు వాటిని రిపేర్‌ చేయడం లేదా కొత్త భవనాన్ని నిర్మించడం వంటివి చేస్తున్నామన్నారు.


Latest News
 

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM