వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమని మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలంటూ సోమవారం తన ఇంట్లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని.. ఏప్రిల్ 13న విగ్రహాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అప్పటి నుంచి అక్కడే ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో పెడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదని వాపోయారు. షర్మిల రాజన్న రాజ్యమంటుందని, కానీ అది కాంగ్రెస్ రాజ్యమన్నారు. రాజ్యాంగ అధినేతకు తెలంగాణలో దిక్కు లేదని, విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM