వాట్సాప్ ‌ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండిలా
 

by Suryaa Desk |

వాట్సాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు 'ఇండెన్' కస్టమర్లు అయితే 7718955555 కు కాల్ చేసి ఎల్ఫీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు వాట్సాప్‌ లో 7588888824 కు REFILL అని టైప్ చేయడం ద్వారా కూడా సిలిండర్ ‌ను బుక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే ఈ మెసేజ్ ను సెండ్ చేయాలి.


 9222201122 కు వాట్సాప్‌లో మెసేజ్ సెండ్ చేయడం ద్వారా హెచ్‌పి గ్యాస్ సిలిండర్‌ ను బుక్ చేసుకోవచ్చు. BOOK అని టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈ నంబర్‌ కు పంపాలి. ఈ సంఖ్య మీకు అనేక ఇతర సేవా వివరాలను కూడా అందిస్తుంది. మీ ఎల్ఫీజీ కోటా, ఎల్ఫీజీ ఐడి, ఎల్ఫీజీ సబ్సిడీ మొదలైన వాటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.


భారత్ గ్యాస్ కస్టమర్లు బుక్ లేదా టైప్ 1 అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800224344 కు పంపించాలి. దీని తరువాత, మీ బుకింగ్ రిక్వెస్ట్ ను గ్యాస్ ఏజెన్సీ అంగీకరిస్తుంది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM