అదుపు తప్పి కారు బోల్తా... ఇద్దరు మృతి
 

by Suryaa Desk |

లారీని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పిన కారు ఎదురుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. మురళి మోహన్ రెడ్డి కుటుంబం( భార్య సుజాత, కూతురు నేహ రెడ్డి, కుమారుడు సాయి తేజ రెడ్డి) హైదరాబాద్ నుంచి పులివెందులకు కారులో వెళ్తుండగా ధర్మవరం స్టేజి దగ్గర లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి అవతలి మార్గంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు మురళి మోహన్, సుజాత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలని స్థానికులు కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. బొలెరో వాహనం ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM