తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...!
 

by Suryaa Desk |

గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలలు తిరిగి తెరిచే వరకు రూ.2000 ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సాయాన్ని లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెల నుంచే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి సాయం అందించడానికి నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రులు అధికారులకు సూచించారు.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM