ముఖంపై కొవ్వును తగ్గించుకోండిలా...!
 

by Suryaa Desk |

మనం రకరకాల డ్రెస్సులతో బాడీ మొత్తాన్నీ క్లోజ్ చేస్తాం. అందువల్ల ఎవరైనా మనలో చూసేది మన ముఖాన్నే. ఆ ముఖం లావుగా కొవ్వుతో నిండినట్లు ఉంటే "ఫేసేంటి అలా ఉంది. సరిగా నిద్రపోవట్లేదా" అని కొందరు. "హ్యాంగోవర్ దిగలేదా" అని ఇంకొందరు ఇలా రకరకాలుగా ప్రశ్నించే ప్రమాదం ఉంటుంది. అందుకే రెగ్యులర్ వర్కవుట్లతోపాటూ ఫేస్‌కోసం ప్రత్యేక వర్కవుట్లు చెయ్యాలి. జనరల్‌గా ఎవరైనా బరువు పెరిగితే ఆటోమేటిక్‌గా ఫేస్ కూడా లావు అవుతుంది. అదే బరువు తగ్గితే ఫేస్ కూడా సన్నబడుతుంది. అయితే చూడచక్కటి ఫేస్ కోసం చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లు అవసరం. ముఖ్యంగా గడ్డం కింద క్యారీబ్యాగ్‌లా పెరిగే కొవ్వుకు చెక్ పెట్టాల్సిందే. ఇందుకోసం రోజుకో చ్యూయింగ్ గమ్ కనీసం అరగంట పాటూ నమలాలి. ముఖంలో కొవ్వు ఉందంటే బాడీ మొత్తం కొవ్వు ఉందనే అర్థం. ముఖంలో కొవ్వును పోగొట్టడం కోసం ఈ ఎక్సర్‌సైజ్ చెయ్యండి. మీ ముఖాన్ని వెనక్కి వంచండి. మీ గడ్డాన్ని ముందుకు పైకి తేవాలి. మీ రెండు బుగ్గల్నీ నోటి లోపలికి లాక్కోండి. వీలైనంతగా ఇలా చెయ్యండి. 5 సెకండ్లపాటూ బుగ్గల్ని అలాగే లోపలికి ఉంచండి. ఇలా రోజూ 10 నుంచి 15 సార్లు చెయ్యండి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువగా తినాలి. మద్యం తాగకూడదు. దాని బదులు నీరు బాగా తాగాలి. స్మోకింగ్ వదిలేయాలి. తీపి పదార్థాలు ముఖ్యంగా పంచదారతో చేసిన స్వీట్లు, చాక్లెట్లు (పరిమితంగా ఓకే), ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి దూరంగా ఉండాలి.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM