తోటకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
 

by Suryaa Desk |

తోటకూరలో ఎన్నో పోషకాలున్నాయి. తోటకూర ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. తోటకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.


- ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.


- తోటకూర తింటే బరువు చాలా సులువుగా తగ్గుతారు.


- తోటకూరలోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది.


- తక్షణశక్తికి తోటకూర తోడ్పడుతుంది.


- ఉడికించిన తోటకూరలో తేనే కలిపి గోధుమ రొట్టెతో తీసుకుంటే మలబద్దకం, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.


- తోటకూర హైబీపీని నియంత్రిస్తుంది.


- తోటకూరలోని విటమిన్‌ సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.


- క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. అందులో ఉన్న ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.


- తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూర్చుతుంది.


- తోటకూర కళ్లకు చాలా మంచిది.


- ఒక కప్పు తోట కూర తీసుకుంటే 5 కోడి గుడ్లు, 2 కప్పుల పాలు, 3 కమలాలు, 25 గ్రాములు మాంసం, 5 యాపిల్స్ తీసుకున్నంత ఉపయోగం కలుగుతుంది.


- తోటకూర ఆకుల రసం ప్రతిరోజు తలకు రాస్తే శిరోజాలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. - తోటకూర రసంలో పసుపు కలిపి రాస్తే.. ముఖంపై మొటిమలు తగ్గుతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM