గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

 నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న మారుతి కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 


 


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM