బీర్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు

byసూర్య | Tue, Apr 06, 2021, 11:07 AM

మండుతోన్న ఎండలను తట్టుకోవడం కోసం అనేలా హైదరాబాదీలు తెగ బీర్లు తాగేస్తున్నారు. సాధారణంగా వేసవిలో బీర్ల విక్రయాలు భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి మాత్రం ఇంకా ఎండకాలం పూర్తిగా ప్రారంభంకాకముందే విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు మందుబాబులు.


గతేడాదిని మించి ఈ ఏడాది అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. గత ఏడాది మార్చిలో 26.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగితే ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగడం విశేషం. దీంతో మే నెలలో భారీగా అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో మాత్రం కొంత మేర బీర్ల అమ్మకాల్లో కాస్త తగ్గుదల కనిపించింది. మళ్లీ మార్చి నెలలో అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో 2727.15 కోట్లు, ఫిబ్రవరిలో 2,331.65 కోట్లు, మార్చి నెలలో 2,473.89 కోట్లు కలిపి మొత్తంగా 7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని లెక్కలు చెబుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2020-21లో మొత్తం 27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్‌ కేసులు, 2.7 కోట్ల బీర్‌ కేసులు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన చూస్తే రోజుకు సగటున మందుబాబులు 90 వేలకు పైగా ఐఎంఎల్, 74 వేలకు పైగా బీర్ కేసులు తాగేశారన్నమాట.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM