తెలంగాణలో 1,498 కొవిడ్ కేసులు

byసూర్య | Tue, Apr 06, 2021, 11:13 AM

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో క్రియాశీల కేసులు 10వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. నిన్న ఒకే రోజు 62,350 కొవిడ్‌ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,14,735, మరణాల సంఖ్య 1,729కి చేరాయి. ఇప్పటి వరకు 3,03,013 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 313 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి


Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM