హైద‌రాబాద్‌లో ఎంఐఎం కార్యక‌ర్త‌ల రేవ్ పార్టీ
 

by Suryaa Desk |

న‌గ‌రంలోని చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 13న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.మ‌జ్లిస్ నేత ప‌ర్వేజ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో ఓ ఇంట్లోకి ఇత‌ర రాష్ర్టాల మ‌హిళ‌ల‌ను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారు. మ‌ద్యం సేవించిన వారు మ‌గువ‌ల‌తో చిందులు వేసిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM