తెలంగాణాలో కొత్తగా 1436 కరోనా పాజిటివ్

byసూర్య | Mon, Oct 19, 2020, 08:37 AM

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా కోవిడ్‌-19తో 1,271 మంది మృతిచెందారు. శనివారం నాటికి రాష్ట్రంలో 22,050 యాక్టివ్‌ కోవిడ్‌ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజు వ్యాధి నుంచి 2,154 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో కలిపి రాష్ట్రంలో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,98,790గా ఉంది. దేశవ్యాప్త రివకరీ రేటు 88 శాతంగా ఉండగా అదే రాష్ట్రంలో 89.5 శాతం ఉంది. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి కొత్తగూడెం-77, జీహెచ్‌ఎంసీ-249, జగిత్యాల-27, జనగాం-21, భూపాలపల్లి-18, గద్వాల్‌-11, కామారెడ్డి-34, కరీంనగర్‌-76, ఖమ్మం-78, ఆసిఫాబాద్‌-16, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌లో 30 చొప్పున, మంచిర్యాల-23, మెదక్‌-20, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-105, ములుగు-21, నాగర్‌కర్నూలు-24, నల్లగొండ-75, నారాయణపేట-3, నిర్మల్‌-21, నిజామాబాద30, పెద్దపల్లి-20, సిరిసిల్ల-27, రంగారెడ్డి-110, సంగారెడ్డి-34, సిద్దిపేట-67, సూర్యాపేట-28, వికారాబాద్‌-25, వనపర్తి-21, వరంగల్‌ రూరల్‌-24, వరంగల్‌ అర్బన్‌-59, యాదాద్రి భువనగిరిలో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM