మహానగరంలో మహిళల మిస్సింగ్..భయంతో జనం

byసూర్య | Sat, Oct 10, 2020, 05:14 PM

తెలంగాణ మహానగరం హైదరాబాద్‌లో మహిళల మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కొంపల్లికి చెందిన భాగ్య తన ఇద్దరు పిల్లలు శ్రీచరణ్(12), ధన్ కుమార్‌(11) తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్తతో గొడవపడిన భాగ్య బిడ్డలతో సహా కనిపించకుండా పోయింది. ఆమె తిరిగిరాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. జీడిమెట్ల పరిధిలో మరో మహిళ అదృశ్యమైంది. సుభాష్ నగర్‌లో నివాసముంటున్న గృహిణి అంజూదేవి(24) కనిపించకుండా పోయింది. ఆమె ఈ నెల 6 వ తేదీ నుంచి అదృశ్యమైంది.
చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త ధీరజ్ కుమార్ సింగ్ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ యువతి అదృశ్యం కేసు నమోదైంది. తట్టి అన్నారానికి చెందిన ఇంటర్ విద్యార్థిని లారా కనిపించకుండా పోయింది. సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేయడం గమనించిన తల్లిదండ్రులు కూతురిని మందలించడంతో ఆమె ఇంట్లో గొడవపడి బయటికి వెళ్లిపోయి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తండ్రి రవికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM