పేద ప్రజలకు బియ్యం, పండ్లు పంపిణి

byసూర్య | Sat, Apr 04, 2020, 01:04 PM

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో పరిశ్రమలు మూత పడటం వల్ల చాలా మంది కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు శనివారం గుడ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో దాతల సహకారంతో 3000 మంది పేద ప్రజలకు 300 క్వింటాళ్ల బియ్యం, అరటిపండ్లను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి టి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, దాతలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM