మానవత్వాన్ని చాటుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

byసూర్య | Sat, Apr 04, 2020, 12:38 PM

రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కు చెందిన మొయిన్, కుమార్తె (4 సంవత్సరాల ) ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణనానికి చెందిన మెయిన్ కు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. తాను కాన్సర్ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స ను పొందుతున్నారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నేడు కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 14 వరకు జరుగుతున్న లాక్ డౌన్ కారణంగా మెయిన్ కుమార్తె గత నెల 27.02.2020 నుండి ఆసుపత్రికి వెళ్ళటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందివ్వటం జరిగింది. మంత్రి కేటీఆర్ వచ్చిన సమాచారంను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి టాగ్ చేసిన వెంటనే స్పందించి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలింపుకు ఏర్పాట్లు చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకున్న మానవత్వాన్ని మరోసారి చాటారు.


Latest News
 

ఎమ్మెల్సీ ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి Thu, Mar 28, 2024, 04:06 PM
పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి Thu, Mar 28, 2024, 04:04 PM
ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం Thu, Mar 28, 2024, 04:02 PM
రుణాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీసీసీబీ డైరెక్టర్ Thu, Mar 28, 2024, 04:01 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయం: ఎమ్మెల్యే మేఘారెడ్డి Thu, Mar 28, 2024, 03:57 PM