ఫోన్ చేస్తే చాలు ఇంటి వద్దకే మందులు

byసూర్య | Sat, Apr 04, 2020, 11:56 AM

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్దులు,వికలాంగులు బయటికి రాలేని స్థితి. వారికి మందులు అవసరం ఉంటాయి. మెడికల్ షాపులు తెరిచి ఉన్నా పోలీసులు బయటికి రానివ్వడం లేదు. దీంతో వారికి మందులు అందజేసేందుకు యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు ఫోన్ చేస్తే వారే ఉచితంగా ఇంటికి మందులు తీసుకొచ్చి ఇస్తారు. వీరు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల వారికి మందులు తీసుకొచ్చి ఇస్తారు. వాట్సాప్ లో మందుల చిట్టి పెడితే వారు మన ఇంటి అడ్రస్ కు మందులు తెచ్చి ఇస్తారు. మందులకు అయిన డబ్బులను ఆన్ లైన్ లో చెల్లించాలి. వారు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినందుకు అదనంగా పైసలు తీసుకోవడం లేదు. ఫ్రీగానే తమ సర్వీసును అందిస్తున్నారు. ఈ సంస్థ సేవలను గుర్తించిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్నాటి రాజేందర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వారి సేవలను అభినందించారు. మందులు అవసరమైతే 9491114616, 8143304148, 703747112, 9182339595, 8897736324 నంబర్లను సంప్రదించాలని సంస్థ అధ్యక్షుడు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మందులు అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముందని, అందుకే తాము ఈ విధంగా సేవలు అందిస్తున్నామని రాజేందర్ తెలిపారు. 




Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM