ఢిల్లీ జమాతే సభ్యులను గుర్తించాం: ఈటల

byసూర్య | Sat, Apr 04, 2020, 11:56 AM

హైదరాబాద్: ఢిల్లీలోని తబ్లిగి ఈ జమాతే మతపర కార్యక్రమానికి హాజరై వచ్చిన వారందరిని గుర్తించే ప్రక్రియ పూర్తయిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.ఢిల్లీకి వెళ్లివచ్చిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు, కరోనా లక్షణాలు కన్పించినవారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి పరీక్షలు చేయించాలని సీఎంకేసీఆర్ ఆదేశించారని ఈటల పేర్కొన్నారు.వీరందరికీ త్వరత్వరగా పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది మూడు షిప్టులలో పనిచేస్తున్నారన్నారు. మొత్తం 6 ల్యాబ్ లలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు ఇద్దరు పాజిటివ్ రోగులు మరణించారని, ఒకరు షాద్ నగర్ కాగా మరొకరు సికింద్రాబాద్ వాసి అని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది చనిపోయారు.ఈ రోజు 75 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్త కేసులు 229కు చేరుకున్నాయన్నారు. 15 మందిని డిశ్చార్జీ చేయగా, 32 మంది ఐసోలేషన్ లో ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM