మహిళల బ్యాంక్ అకౌంట్లలోకి ఈరోజు నుంచే డబ్బులు..

byసూర్య | Fri, Apr 03, 2020, 12:34 PM

దేశాన్ని కరోనా వైరస్ బారి నుంచి రక్షించడానికి మోదీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. దీని వల్ల పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. అందుకే వీరి కోసం కేంద్ర ప్రభుత్తం పలు చర్యలు తీసుకుంది. నగదు బదిలీ కూడా వీటిల్లో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. ప్రతి నెలా 3 నెలల పాటు జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.500 అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే ప్రకటించారు.


ఇప్పుడు జన్ ధన్ అకౌంట్ కలిగిన మహిళలకు మొదటి విడత కింద రూ.500 అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏప్రిల్ 3 అంటే ఈ రోజు నుంచే మహిళల జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి. రూ.500 ఈరోజు ఖాతాల్లో జమవుతుంది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత డబ్బులు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 మధ్యలో అన్ని అకౌంట్లలోనూ జమవుతుంది.జన్ ధన్ అకౌంట్ నెంబర్ చివరిలో 0 లేదా 1 ఉంటే వారికి ఈ రోజే డబ్బులు వచ్చేస్తాయి. అకౌంట్ నెంబర్ చివరిలో 2 లేదా 3 ఉంటే ఏప్రిల్ 4న, 4 లేదా 5 ఉంటే ఏప్రిల్ 7న, 6 లేదా 7 ఉంటే ఏప్రిల్ 8న, ఇక 8 లేదా 9 ఉంటే ఏప్రిల్ 9న రూ.500 డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. మీ అకౌంట్ నెంబర్ చివరిలో 0 లేదా 1 ఉంటే ఈరోజే బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.


కాగా రూపే డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇకపోతే కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు ఇప్పటికే 2,300 పైకి చేరాయి. అంతర్జాతీయంగా 10 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. 53 వేల మందికి పైగా కోవిడ్ 19 వల్ల మరణించారు.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM