రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

byసూర్య | Fri, Apr 03, 2020, 12:09 PM

 కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ పట్టణంలోని 10, 11వ వార్డుల్లో చౌకధరల దుకాణాల్లో లబ్దిదారులకు బియ్యం పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, తెల్లరేషన్‌ కార్డు కల్గిన లబ్దిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అందరు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించి ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్‌ చందు, 12వ వార్డు కౌన్సిలర్‌ శ్రీలత-రమేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM