తెలంగాణలో 109కి కరోనా కేసులు

byసూర్య | Thu, Apr 02, 2020, 08:07 AM

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్‌ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తుల్లో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయినట్టు తెలిపింది. ఇతను ప్రార్థనలకు దిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 88 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 109కి చేరినట్లయింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది.కరీంనగర్‌ నగరంలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఈయన ఇండోనేసియన్లకు సహాయం అందించిన వ్యక్తి కావడం గమనార్హం. ఆ పది మంది ఇండోనేషియన్లను రామగుండం నుంచి కరీంనగర్‌కు ఇతనే తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. ఇతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక బుధవారం సాయంత్రం తెలిపారు.


 


మరోవైపు, కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా మారుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగంగా చేపడుతోంది. దీనికి తోడు దిల్లీలో మత ప్రార్థనలకు తెలంగాణ వాసులు చాలా మంది వెళ్లడంతో ఏ మాత్రం అనుమానంతో వ్యక్తులు ఆస్పత్రులకు వచ్చినా వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా చికిత్సలకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద రూ.307.06 కోట్లను విడుదల చేయగా.. సంబంధిత ఉత్తర్వు బుధవారం వెలువడింది.


 


Latest News
 

దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 12:09 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి Thu, May 02, 2024, 12:04 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి" Thu, May 02, 2024, 12:03 PM
జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి Thu, May 02, 2024, 11:47 AM
ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM