పరగడుపునే నెయ్యి తీసుకుంటే ?

byసూర్య | Sun, Mar 29, 2020, 02:32 PM

సాధారణంగా మనలో చాలా మందికి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ చుక్క గొంతులో పడందే బెడ్ మీద నుండి పైకి లేవరు. నిజానికి ఉదయాన్నే కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఓ సారి చూడండి. * ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి.
* ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
* నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
* ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
* అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM