సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం

byసూర్య | Sat, Mar 28, 2020, 01:53 PM

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. ఐదు అడుగుల పాము సజ్జనార్‌ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఆయన పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌ను పిలిపించారు. పాములు పట్టడంలో అందెవేసిన చెయ్యని ఆ కానిస్టేబుల్‌కు డిపార్టు్‌మెంట్‌లో పేరుంది. సజ్జనార్‌ ఇంటికి చేరుకున్న వెంకటేశ్‌ పామును చాకచక్యంగా పట్టి బ్యాగులో వేసుకున్నాడు. దానికిఎలాంటి హానీ తలపెట్టకుండా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో అప్పజెబుతానని చెప్పాడు. పామును పట్టి దానితో పాటు తమ ప్రాణాలను రక్షించినందుకు సీపీ సంతోషం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ ప్రతిభకు మెచ్చి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘ఎవరైనా పామును చూడగానే భయపడిపోయి దాన్ని చంపటానికి ప్రయత్నించకూడదు. దానికి బదులుగా పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాలి. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. మనం వాటికి హాని చేయనంత వరకు అవి మనకు హాని చేయవ’ని అన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM