హైదరాబాద్‌లో 'క్వారంటైన్‌’ ఇళ్లకు జియో ట్యాగింగ్‌

byసూర్య | Sat, Mar 28, 2020, 02:15 PM

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ సోకిన లేదా అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. వీరితోపాటు ఎవరైతే విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నారో వారి ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. హోంశాఖ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసులు, ఆరోగ్య శాఖల బృందాలు వారి ఇళ్లకు వెళ్తూ వివరాలను సేకరిస్తున్నాయి. ఆ వ్యక్తులను గుర్తించడంతోపాటు హోంశాఖకు సంబంధించిన ముద్రను కూడా చేతిపై వేస్తున్నారు. ఆ ముద్రలో ఎంతకాలం క్వారంటైన్‌లో ఉండాలనే తేదీ కూడా ఉంటుంది. ఆ వివరాలు, తీసిన ఫొటోలు, ఆ ఇంటి ఫొటో, ఇతర అన్ని రకాల సమాచారాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు.


Latest News
 

ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM