వేసవిలో ఈ కూరగాయలను తీసుకుంటే?

byసూర్య | Sat, Mar 28, 2020, 12:50 PM

వేసవి తాపాన్ని తీర్చేందుకు పండ్లు, జ్యూస్‌లతో సరిపెట్టకుండా కూరగాయలను కూడా రోజు మీ డైట్‌లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయల్లో గల పీచు పదార్థాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు ఏమాత్రం పెరగదు. గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్ కూరగాయలను రోజువారీ వంటల్లో చేర్చుకుంటే గొంతు నొప్పి, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్‌లను నిరోధించవచ్చు. క్యారెట్, స్వీట్ పొటాటో, క్యాలీ ఫ్లవర్ వంటి బీటా కరోటిన్ కలిగిన వెజిటేబుల్స్‌ను తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేయవచ్చు.
* ఉసిరి, నిమ్మకాయల్లో అధికంగా విటమిన్ సి ఉండటంతో ఇవి క్యాన్సర్‌ను నివారిస్తాయి.
* మిరియాలు, క్యాబేజీ, టమోటా, ఆకుకూరలు, పప్పు దినుసులు, బీట్ రూట్, బంగాళాదుంపల్లో ఐరన్ శక్తి ఎక్కువగా ఉంది.
* క్యాబేజీలో క్యాల్షియం అధికంగా ఉండటంతో దంత, ఎముకలకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
* మిరపకాయలు, గుమ్మడి, వంకాయలు, క్యారెట్, టమోటాలు, చెర్రీ, ఉల్లిపాయలు, ఆకుకూరల్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటంతో వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.


Latest News
 

ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM
మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం Wed, May 01, 2024, 11:29 AM