తెలంగాణ ఎన్నికల బరిలో 12,956 మంది అభ్యర్ధులు..

byసూర్య | Thu, Jan 16, 2020, 04:26 PM

హైదరాబాద్ –తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో  12,956 మంది అభ్యర్ధులు 3052 వార్డులలో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు… రాష్ట్రంలోనితొలి విడతలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఇందుకోసం  జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నామినేషన్ల పరిశీలన జరగ్గా, తిరస్కరించిన నామినేషన్లపై 12వ తేదీ వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది.. మొత్తం 3,052 వార్డులకు గానూ,  12,956 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 3,023, కాంగ్రెస్‌ 2,618, బీజేపీ 2,313, టీడీపీ 348, ఎంఐఎం 280, సీపీఐ 177, సీపీఎం నుంచి 166 మంది పోటీలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 415 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇక 3,750 మంది స్వతంత్రులుగా పోటీ  చేస్తున్నారు. కాగా కరీంనగర్ కార్పొరేషన్ కు మలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి…. ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది…ఈ నెల 24న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి..


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM