8 నోటిఫికేషన్లు... 8,612 పోస్టులు

byసూర్య | Fri, Jan 10, 2020, 07:41 PM

నిరుద్యోగులకు భారతీయ రైల్వే మరో శుభవార్త చెప్పింది. వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ కొలువుల జాతరకు శ్రీకారం చుట్టింది. రైల్వే జోన్లతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వాటియొక్క పూర్తి వివరాలు LOKAL యాప్ యూజర్ల కోసం ప్రత్యేకంగా....


1. నోటిఫికేషన్ల వారీగా చూస్తే వెస్టర్న్ రైల్వే 3,553 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/3083EfN


2. సెంట్రల్ రైల్వే 2562 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2R2mgtM


3. సౌత్ ఈస్టర్న్ రైల్వే 1785 ఖాళీలను ప్రకటించింది. మెరిట్ ద్వారా అప్రెంటీస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఆగ్నేయ రైల్వే. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2FyFstP


4. భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌ సంబంధించిన పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2sVmb35


5. క్లర్క్ పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 251 పోస్టులున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2NbwWow


6. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం 26 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2R1BDmg


7. నార్త్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/2Nf74bD


8. రైల్వేలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో కూడా ఖాళీల భర్తీ కొనసాగుతోంది. పశ్చిమ రైల్వే 14 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/309ORl6


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM