తెలంగాణ మంత్రికి సమన్లు జారీ

byసూర్య | Fri, Jan 10, 2020, 07:56 PM

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో పలువురికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ కోర్టు అనుబంధ ఛార్జీషీటును విచారణకు స్వీకరించింది. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, పలువురు విశ్రాంత అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. కేసు విచారణలో భాగంగా వీరందరిని ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్ వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు కూడా సమన్లు జారీ అయ్యాయి.


అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల కేటాయింపుకు సంబంధించి అవకతవకలు జరిగాయని సీబీఐ తన అనుబంధ ఛార్జీషీటులో పేర్కొంది. అప్పుడు గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తుంది. అనుబంధ ఛార్జీషీటును విచారణకు స్వీకరించవద్దని జగన్ సహా ఇతర నిందితుల లాయర్లు వాదించారు. సీబీఐ మాత్రం దానికి తోసిపుచ్చింది. దీంతో సీబీఐ న్యాయస్థానం అనుబంధ ఛార్జీషీటును విచారణకు స్వీకరించింది. 2 సంవత్సరాల క్రితమే ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీటు దాఖలైంది. కానీ అప్పుడు ఉన్నత న్యాయస్థానం దీని పై స్టే విధించడంతో విచారణ ఆగిపోయింది. తాజాగా ఉన్నత న్యాయస్థానం దీని పై స్టే ఎత్తివేయడంతో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది.


తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ కావడంతో తెలంగాణ కేబినేట్ లో ఇది చర్చనీయాంశమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ విచారణలో ఆమె పై అభియోగాలు నిజమైతే చట్టం ప్రకారం శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM