పంచాయితీ కార్మికుల‌కు ముందే వ‌చ్చిన దీపావ‌ళి

byసూర్య | Tue, Oct 15, 2019, 01:04 AM

 దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని  తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు తీపికబురు అందించింది.   ఈ మేరకు సోమవారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేస్తూ, కార్మికుల వేతనాలను నెలకు రూ. 8,500లకు పెంచుతూ నిర్ణయం తెలిపారు.   గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు ఒక్కో గ్రామంలో ఒక్కోలా వేతనాలు ఉన్నాయని గుర్తించామ‌ని, ఇక‌పై  అన్ని పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న‌ట్టు అధికారులు చెప్పారు. పెంచిన జీతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతుండ‌గా   ప్రభుత్వం జీతాలు పెంచడం ద్వారా త‌మ కుటుంబాల్లో దీపావళి పండగ ముందే  తీసుకువ‌చ్చిందంటున్నారు కార్మికుల కుటుంబ‌స‌భ్యులు 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM