ప్ర‌ధాన డిమాండ్ కాద‌ని... కేకే రాయ‌బారాలా?

byసూర్య | Tue, Oct 15, 2019, 01:04 AM

 ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తామని అర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక తేల్చి చెప్పింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ ను కాద‌ని ఇత‌ర అంశాల‌పై చ‌ర్చ‌కు ర‌మ్మ‌ని ఎంపి కె.కెతో ప్ర‌భుత్వం రాయ‌బారాలు న‌డిపేందుకు య‌త్నిస్తున్న విష‌యం పై కార్మిక సంఘాల కుటుంబ‌స‌భ్యులు భ‌గ్గుమ‌న్నారు. ఈ మేర‌కు రాజధాని నగరంలోని ముషిరాబాద్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, కండక్టర్ సురేంద్రగౌడ్‌ల ఫొటోలకు నివాళులర్పిస్తూ, ప్ర‌భుత్వంలోకి ఆర్టీసీని తీసుకోవ‌ట‌మే త్యాగ‌మూర్తుల‌కు నిజ‌మైన నివాళి అని నినాదాలు చేసారు.  ఇక తెలంగాణ ఉద్యమ పంథాలోనే సమ్మెను కొనసాగిస్తామ‌ని తేల్చి చెప్పారు.


మ‌రోవైపు సమ్మెకు మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్ లోని బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాధం, తోపులాట చోటు చేసుకోవ‌టంతో ప‌లువ‌రు విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. 


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM