స్ట్రీట్ లైట్లకు మీటర్ బి గించడంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానం

byసూర్య | Mon, Oct 14, 2019, 09:58 PM

జగిత్యాల  గ్రామాలలోని స్ట్రీట్ లైట్లను అన్నింటికి మీటర్ బిగించడంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ ఆన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక పై సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాదులో జరిగిన సమావేశంలోని అంశాలపై అధికారులకు తెలుపుతూ ప్రతి గ్రామంలో ప్లాంటేషన్ , రెవెన్యూ ప్లాంటేషన్, వాటరింగ్, డంపింగ్ యార్డ్ ,వైకుంఠ దామం, నర్సరీ ప్రతి గ్రామంలో ఉండే విధంగా చూడాలని అన్నారు. మంకీ ఫుడ్ కోర్టు పనుల నిమిత్తము ఈజీఎస్ ఫాడ్ ను ఉపయోగించు  కోవాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సిబ్బందిని బట్టి ఎన్ని వార్డులు ఉన్నాయో ఒక్కొక్కరికి ఎన్ని వార్డులు వస్తాయో వాటిని విభజించి ఒక్కరికి ఎన్ని వాటిలో వచ్చును వార్డు గోడపైన సిబ్బంది యొక్క పేరు సెల్ నంబరు వ్రాయాలని అన్నారు. గ్రామాలలో ట్రాక్టర్ కొనుగోలు ట్యాంకరు, ఆయా గ్రామ పంచాయతీలకు చిన్నది, పెద్దది కావాల్సి ఉంటే గ్రామ సభలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఆమోదం పొంది ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. గ్రామపంచాయతీలలో విద్యుత్ బిల్లులను చెల్లించాలని, గ్రామాలలోని స్ట్రీట్ లైట్లను అన్నింటికి మీటర్ బిగించడంలో రాష్ట్రం లోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని అందుకు విద్యుత్ శాఖ అభినందించారు. గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం అయినట్లయితే వారిపై చర్యలు తప్పవని అన్నారు. గ్రామ పంచాయతీలలో వార్షిక ప్రణాళిక గ్రామ సభలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఆమోదం పొందిన పనులను మాత్రమే చేయాలని తెలిపారు.  ప్రతి గ్రామ పంచాయితీలో ఎల్ఇడి లైట్ లు పెట్టాలని అన్నారు.


Latest News
 

మదీనా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 29, 2024, 12:51 PM
శ్రీనివాసరెడ్డిని కలిసిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు Fri, Mar 29, 2024, 12:51 PM
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసి Fri, Mar 29, 2024, 12:46 PM
సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM