వాట్సాప్ వినియోదారులకు శుభవార్త

byసూర్య | Sat, Oct 12, 2019, 02:41 PM

వాట్సాప్ వినియోదారులకు శుభవార్త. వాట్సప్ లో ఎన్నో ఫీచర్లు ఉండవచ్చు. కానీ ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించే అవకాశాన్ని వాట్సాప్ ఇంతవరకు కల్పించలేదు. ఒకే యాప్ ద్వారా రెండు ఖాతాల నిర్వహణ వాట్సాప్ లో అంత సులభం కాదు. ఫేస్ బుక్, ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో సులువుగా లాగవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వడం ద్వారా వివిధ ఖాతాల నిర్వహణ సులభం అవుతుంది. కానీ వాట్సాప్ లో లాగవుట్ చేసి లాగిన్ చేయడం కూడా అంత సులభం కాదు. కానీ కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను ఉపయోగించవచ్చు.


మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే....


కొన్ని కంపెనీల ఫోన్లలో డ్యూయల్ యాప్స్ ఉపయోగించేందుకు ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించవచ్చు. షావోమి ఫోన్లలో అయితే ‘Dual apps’, శాంసంగ్ లో ‘Dual Messenger’, ఒప్పోలో ‘Clone apps’, వివోలో ‘App Clone’, అసుస్ లో ‘Twin apps’, హువావే, హానర్ ఫోన్లలో అయితే ‘App twin’ ఫీచర్లను ఉపయోగించి రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.


పైన పేర్కొన్న ఫోన్లలో రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించాలంటే..


✱ ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.


✱ అనంతరం పైన ఉన్న ఫోన్లలో మీ ఫోన్ కు సంబంధించిన ఫీచర్ ను ఓపెన్ చేయాలి.


✱ అక్కడ మీకు కనిపించే యాప్స్ జాబితాలో వాట్సాప్ ను ఎంచుకుని దాన్ని ఎనేబుల్ చేయాలి.


✱ ఆ ప్రక్రియ పూర్తవగానే మీ హోం స్క్రీన్ ఓపెన్ చేస్తే, మీరు ఉపయోగించే వాట్సాప్ యాప్ పక్కనే మరో వాట్సాప్ లోగో కనిపిస్తుంది.


✱ దాన్ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా మీరు ఏ నంబర్ తో అయితే రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించాలనుకుంటున్నారో దానితో ఉపయోగించుకోవచ్చు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM