అథ్లెటిక్ పోటీలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

byసూర్య | Sat, Oct 12, 2019, 02:53 PM

రాష్ట్రస్థాయి ఆరవ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలను మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేటలో ప్రారంభించారు. మంత్రి క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వారితో కరచాలనం చేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యపేటను క్రీడా వేదికగా రూపొందిస్తామనీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 2014 తర్వాత అనేక క్రీడా పోటీలకు సూర్యపేట వేదికగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. శారీరకంగా బలంగా తయారవడానికి క్రీడలు దోహదపడతాయని మంత్రి అన్నారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి లోపించడంతో మానసిక ైస్థెర్యం కోల్పోతారని మంత్రి ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడారు. చదువు కంటే కూడా క్రీడలు రుగ్మతలను రూపుమాపుతాయని ఆయన అన్నారు. ఓటమి నుంచే గెలుపు పుడుతుందన్న అంశాన్ని విద్యార్థులు గ్రహించాలనీ, చిన్న చిన్న పరాజయాలకే కృంగిపోకూడదన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM