టీడీపీ నేతలకు కమలం గాలం ?

byసూర్య | Sat, Aug 17, 2019, 10:02 PM

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలని 2023 టార్గెట్ గా పక్కా వ్యూహంతో అడుగులు వెయ్యబోతున్నారు కమలం నేతలు. అందుకు ఆగస్ట్ 18 టైటిల్ గా పక్కా స్కెచ్ వేసింది బీజేపీ. తెలంగాణాలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆగస్ట్ 18న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటన వెనుక బీజేపీ వ్యూహమేంటి? అసలు 18న వీళ్లు ఏం చేయబోతున్నారు.. ఇదే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. 


సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రం పై మరింత ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే నడ్డా ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకరష్ కు భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఆగస్ట్ 18న తెలంగాణలో ఉన్న టీడీపీని దాదాపుగా బీజేపీలో విలీనం చేసుకోబోతోంది. అంతే కాదు ప్రతి జిల్లానుంచి బాగా గుర్తింపు పొందిన ఒక లీడర్ ని పార్టీలో చేర్చుకోబోతున్నారు.
తెలంగాణలో టీడీపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్ర శేఖర్ రెడ్డి తప్ప ఎవరూ లేరు. కానీ జిల్లా స్థాయినుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ కార్యకర్తలు బాగానే ఉన్నారు. వీరందరినీ కమల దళంలో కలిపేసుకోవాల నుకుంటోంది బీజేపీ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒకేసారి బీజేపీలో చేరబోతు న్నారని తెలుస్తోంది. దాంతో టీడీపీ శాఖ మన పార్టీలో విలీనం కాబోతుందని కాషాయ కండువాలు చెబుతు న్నాయి. ఎల్ రమణ తప్ప టీడీపీ నేతలంతా ఆగస్ట్ 18న టీడీపీలో చేరబోతున్నారట.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM