ఉప్పల్‌లో ప్రారంభమ‌యిన శిల్పారామం!

byసూర్య | Sat, Jun 22, 2019, 10:05 PM

ఉప్పల్‌లో కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించారు.గత సంవత్సరం పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ ఈ ప్రాంతంలో శిల్పారామం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పురపాలక శాఖ నుంచి వెంటనే నిధులు విడుదల అవడంతో పాటు పనులు కూడా చకచకా జరిగి ఉప్పల్‌లోని శిల్పారామం రూపుదిద్దుకున్నది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడానికి ఇది మంచి వేదికని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రతి జిల్లాకు ఓ శిల్పారామం రావాలని ఆయన అన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ మినీ శిల్పారామానికి కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరంగా గడపవచ్చు. చేతి వృత్తుల వారికి ఉపాధి కల్పించడమే శిల్పారామం ప్రత్యేకత. శిల్పారామం పక్కనే ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల మూసీ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టవచ్చని అన్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.


 


Latest News
 

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి పొందాలి: జిల్లా కలెక్టర్ Wed, May 08, 2024, 04:09 PM