హోండా యాక్టివా బైక్ క‌నిపిస్తే చాలు!

byసూర్య | Sat, Jun 22, 2019, 09:46 PM

కొత్త హోండా యాక్టివా బైక్ లను టార్గెట్ చేసి వాటిని దొంగిలిస్తున్న పాత నేరస్థుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు వివరాలు వెల్లడించారు. మహ్మద్ అర్బజ్ ఖాన్(19) పాతబస్తీ భవానీనగర్ లో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేస్తున్న అర్బజ్ కి కొత్త బైక్ కొనాలనే కోరిక ఉండేది. కానీ అతడి సంపాదనతో అది సాధ్యం కాలేదు. దీంతో ఎలాగైనా సరే కొత్త బైక్ పై తిరగాలని ప్లాన్ చేశాడు. డ్రైవింగ్ సరిగా రాకపోవడంతో గేర్లు లేని హోండా యాక్టివాను సెలక్ట్ చేసుకున్నాడు. డూప్లికేట్ ‘కీ’ తో యాక్టివాల చోరీకి స్కె చ్ వేశాడు. కొత్త బైకులనే తన టార్గెట్ గా పెట్టుకున్నాడు. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న కొత్త హోండా యాక్టివా కనిపిస్తే దాన్ని దొంగిలిం చేవాడు.
ఇలా తను నివాసం ఉండే భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్బజ్ ఖాన్ రెండు యాక్టివాలను దొంగిలించాడు. చోరీ చేసిన బైక్ లో పెట్రోల్ ఉన్నంత వరకు తిరిగే వాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ ‘కీ’ తో పెట్రోల్ ట్యాం క్ ఓపెన్ కాకపోతే ఆ బైక్ ను ఇంట్లోనే పెట్టేవాడు. ఆ తర్వాత అర్బజ్ ఖాన్ మళ్ళీ మరో హోండా యాక్టివా చోరీకి ప్లాన్ చేసేవాడు. ఇలా భవానీనగర్ లో రెండు, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ ను దొంగిలించాడు. ఇలాంటి బైక్ చోరీలకు పాల్పడుతూ రెండేళ్ళ క్రితం కామాటిపుర, భవానీనగర్ పోలీసులకు అర్బజ్ ఖాన్ పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తరువాత మళ్ళీ హోండా యాక్టివాలను దొంగిలించడానికి స్కెచ్ వేశాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పె క్టర్ సాయిని శ్రీనివాస్ రావు టీమ్ శుక్రవారం అర్బజ్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. నిందితుడు అర్బజ్ ఖాన్ దగ్గరి నుంచి 3 హోండా యాక్టివా బైక్ లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM