టీ సచివాలయ శంకుస్థాపనకు జగన్!

byసూర్య | Sat, Jun 22, 2019, 10:21 PM

తెలంగాణ కొత్త సచివాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ సచివాలయ భవనాల శంకుస్థాపన ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, నదీ జలాల వివాదాలను కూడా పరిష్కరించుకునే దిశగా జగన్, కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకుగాను ఇరువురు ముఖ్యమంత్రులు ఈ నెల 28వ తేదీన అమరావతిలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధికారులు కూడా వస్తారని సమాచారం.
ముఖ్యమంత్రుల సమావేశం విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. దానికి ముందు హైదరాబాదులో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతారని సమాచారం.
నదీజలాల పంపకాలకు సంబంధించి కోర్టుల్లో పలు కేసులు ఉన్నాయి. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, కేసీఆర్ కు మధ్య గవర్నర్ సత్సంబంధాలను నెలకొలిపి చర్చలు జరిగే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితాలు కనిపించలేదు. అయితే, ప్రస్తుతం ఇరువురు ముఖ్యమంత్రులు ఇచ్చిపుచ్చుకునే దిశలో సాగుతున్నందున సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చునని భావిస్తున్నారు.
నదీజలాల వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్రం జోక్యం గానీ గవర్నర్ జోక్యం గానీ అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు సాగినప్పుడు ఆ అవసరం ఏర్పడదని ఆయన అంటున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగులో ఉన్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. దీంతో వాటిని పూర్తి చేసే దిశగా వివాదాలను పరిష్కరించుకోవాలని కెసిఆర్, జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరువురి మధ్య భేటీ జరుగుతుందని అంటున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM