రూ. 1.7 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్ స్వాధీనం

byసూర్య | Wed, Jun 19, 2019, 12:30 PM

రూ. 1.7 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్(తిమింగిలం వాంతి)ని ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా రైడ్ చేసి విద్యావిహార్ ప్రాంతంలోని సబర్భన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద నుంచి 1.3 కేజీల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్పెర్మ్ వేల్ అంతరించిపోతున్న జాబితాలో చేర్చబడింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


Latest News
 

ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే Mon, May 06, 2024, 09:48 PM
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ' Mon, May 06, 2024, 09:01 PM
మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, May 06, 2024, 08:57 PM
ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా Mon, May 06, 2024, 08:53 PM
ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM