ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే

byసూర్య | Mon, May 06, 2024, 09:48 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ర్యాపిడో సంస్థ గుడ్‌ న్యూస్ వినిపించింది. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తుండగా.. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కూడా తమవంతుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ర్యాపిడో సంస్థ.. వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పోలింగ్ రోజున ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్న నిర్ణయంతో.. ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది.


తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఉచిత సేవలు అదించనున్నట్టు ర్యాపిడో సంస్థ వెల్లడించింది. అయితే.. పోలింగ్ రోజున ఓటర్లు ర్యాపిడో యాప్‌‌లో "VOTE NOW" అనే కూపన్ కోడ్‌‌ను ఉపయోగించి ఫ్రీ రైడ్‌‌ను పొందొచ్చని సంస్థ వివరించింది. పోలింగ్ రోజున ఈ నాలుగు నగరాల్లో మొత్తం 600 మంది కెప్టెన్లు అందుబాటులో ఉంటారని పేర్కొంది. రాష్ట్రంలో ఓటు శాతాన్ని పెంచుకునేందుకు తమవంతు సహకారం ఎన్నికల సంఘానికి అందిస్తామని చెప్పింది.


కాగా.. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు అందించేందుకు ర్యాపిడో సంస్థ నిర్ణయించింది. కాగా.. ఇందుకోసం పోలింగ్ రోజున 10 లక్షల మంది కెప్టెన్లను అందజేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా.. వికలాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే మార్గంలో రవాణా వ్యయం లేకుండా తమ హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. హైదరాబాద్‌లో ర్యాపిడో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సీఈవో వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ రొనాల్డ్ రోస్, సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM
వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీకూ ఆ మెస్సేజ్ వచ్చిందా Sun, May 19, 2024, 04:32 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Sun, May 19, 2024, 04:29 PM
తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై Sun, May 19, 2024, 04:26 PM
తెలంగాణలో మెగాఫుడ్‌ పార్క్‌.. 25 వేల మందికి ఉపాధి Sun, May 19, 2024, 03:51 PM