తొమ్మిది నెలల పసిపాపను రేప్ చేసి చంపేసిన కామాంధుడు

byసూర్య | Wed, Jun 19, 2019, 12:28 PM

వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హన్మకొండ నడిబొడ్డున దారుణ సంఘటన జరిగింది. అభం శుభం తెలీని , తనపై జరుగుతున్న దారుణాన్ని కూడా చెప్పలేని ఓ చిన్నారి జీవితం మొగ్గలోనే తుంచేశాడు ఓ కామాంధుడు . ఓ మృగాడి కామ దాహానికి తొమ్మిది నెలల పసి పాప బలైపోయింది.ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసం ఉండే దంపతులు ఎండాకాలం కావటంతో ఇంటి టెర్రస్ పైన తమ తొమ్మిది నెలల పాపతో పాటు నిద్రిస్తున్నారు. అందరూ నిద్రలో ఉండగా ప్రవీణ్ అనే కామాంధుడు నిద్రలో ఉన్న పాపను ఎత్తుకెళ్ళి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పాపపై లైంగిక దాడికి దిగాడు . పాప గుక్క పెట్టి ఏడుస్తున్నా వదలకుండా చిన్నారిపై పాశవిక చర్యకు పాల్పడ్డాడు.


 


 


చిన్నారి కనిపించకపోవటంతో పాప కోసం వెతుకుతూ వెళ్ళిన తల్లిదండ్రులు చిన్నారిపై ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యాన్ని చూసి ప్రవీణ్ ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న పాపను తీసుకుని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళినా లాభం లేకపోయింది. అప్పటికే పాప ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ప్రవీణ్ ను పోలీసులకు అప్పగించారు. పసిపాప అని కూడా లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించి అత్యాచారం చేసిన ప్రవీణ్ సమాజంలో ఉంటె చాలా ప్రమాదమని అతడికి కఠిన శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు పాప తల్లిదండ్రులు.సమాజంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నా కామాంధులు అన్నెం పున్నెం తెలియని బాలికలను పొట్టన పెట్టుకుంటూనే ఉన్నారు. చట్టాలు మాత్రమే కాదు, సమాజంలోమే మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి ఇంటి నుండీ ప్రారంభం కావాలి. నైతిక విలువలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. విచక్షణా జ్ఞానంతో పిల్లలను ఎదగనివ్వాలి . అంతే కాదు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి తక్షణ శిక్షలు అమలు చెయ్యాలి. అప్పుడు కొంతైనా మార్పు వచ్చే అవకాశం వుంటుంది. లేకుంటే పసి మొగ్గల బ్రతుకులు కూడా ఇలా చిద్రం అవుతూనే ఉంటాయి. సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM