9నెలల చిన్నారిపై అత్యాచారం

byసూర్య | Wed, Jun 19, 2019, 10:46 AM

వరంగల్ జిల్లాలోని హన్మకొండలో దారుణం జరిగింది. 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగింది. టైలర్ స్ట్రీట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి మృతదేహాన్నివరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగన్, రచనలకు 9 నెలల చిన్నారి ఉంది. టైలర్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నారు. ఆడిపిస్తానని చిన్నారిని ప్రవీణ్ అనే యువకుడు తీసుకెళ్లాడు. కానీ ఎంతసేపటికీ చిన్నారిని తీసుకరాలేదు. అనుమానం వచ్చిన రచన..అక్కడకు వెళ్లింది. చిన్నారి విగజీవిగా పడి ఉండడంతో షాక్‌కు గురైంది. ప్రవీణ్ అత్యాచారం జరిపి..చిన్నారిని చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిట్టిపొట్టి మాటలు, అల్లరి, చిలిపి చేష్టలతో సందడిగా చేసే చిన్నారి ఇక లేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి పొందాలి: జిల్లా కలెక్టర్ Wed, May 08, 2024, 04:09 PM