లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Tue, Jun 18, 2019, 05:14 PM

స్టాక్ మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఆటో రంగ షేర్లు కూడా నష్టపోతూనే వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి. బ్యాంకు షేర్లలోనూ కొనుగోళ్లను గమనించొచ్చు.


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.64 శాతం తగ్గుదలతో 60.56 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.38 శాతం తగ్గుదలతో 51.97 డాలర్లకు దిగొచ్చింది. డాలర్ తో రూపాయి మారకం విలువ‌ 24 పైసలు పెరుగుదలతో 69.66 వద్ద ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM