12 మంది ఉత్తమ పౌరులకు ఫ్రీ మేసన్స్ స‌త్కారం

byసూర్య | Mon, Mar 18, 2019, 12:37 AM

హైద‌రాబాద్‌ గోషామహాలో లోని ఫ్రీ మేసన్స్ బారదారి మెసోనిక్ బిల్డింగ్ లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమం లో మానవత్వం, నిజాయితీని చాటిన పన్నెండు ఉత్తమ పౌరులను  ఫ్రీ మేసన్స్ కు చెందిన లాడ్జి కీస్ నంబర్ 297 మరియు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాఫ్టర్ కలిసి సంయుక్తంగా ఈ వినూత్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సన్మాన కార్యక్రమం లో పోలీసు అధికారులు, ఆటో డ్రైవర్లు, సామాన్య పౌరులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇందులో తన ఆటోలో ఓ ప్రయాణికుడు పది లాజ్షల్ రూపాయలు మర్చిపోతే ఆ డబ్బును గచ్చిబౌలి పోలీసులకు అప్పగించిన జర్పుల రమేష్; గర్భవతులను, వృద్ధులను, అంగవైకల్యులను ఉచితంగా తీసుకెళ్లే ఆటోడ్రైవర్ నారాయణ; చలికి దాని ద్వారా వచ్చే అనారోగ్యానికి, చికిత్సకు జంకి, పాఠశాల మానివేసిన చిన్నారులను స్కూలుకు రప్పించేందుకు స్వంత ఖర్చులతో చలికి తట్టుకునే వెచ్చని టోపీలు, దుస్తులను అందించిన టీచర్ కోడిప్యాక రమేష్; రెండు సంవత్సరాల తల్లివదిలి వేసి వెళ్లిన చిన్నారిని చనుబ్రాలు అందించిన మహిళా కానిస్టేబుల్ ప్రియాంకా మరియు ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చిన ఆమె భర్త కానిస్టేబుల్ రవీందర్;  డ్యూటీ పరిధిని దాటి ఎంతో మంది అభాగ్యులకు చేయూత నందించిన పెట్బషీరాబాద్ సి. ఐ మహేష్; తన ఆటో లో మర్చిపోయిన 37,060/- నగదును యజమానికి  చేర్చివేసిన వేముల రాజు; రోడ్డు పై దొరికిన 41,000/- రూపాయలను అందించిన ఆటిపాముల జనార్దన్; 6600/-- రూపాయలను పోలీసులకు అందించిన సాఫ్ట్స్వేర్ ఇంజినీర్ రాచయ్య; విధినిర్వహణలో నిజాయితీని చాటిన ట్రాఫిక్ పోలీసులు బ్రహ్మ చారి మరియు హోమ్ గార్డ్ బీ. గోపాల్ ఉన్నారని  లాడ్జి కీస్ నంబర్ 297 మరియు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాఫ్టర్ ప్రతినిధి డి. రామచంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM