లోక్‌స‌భ‌కు కేసీఆర్ పోటీ ఖాయ‌మా?

byసూర్య | Mon, Mar 18, 2019, 12:10 AM

 ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ద్వారా ఎన్నిక‌ల త‌దుప‌రి కేంద్రంలో చక్రం తిప్పుతామని చెబుతున్న గులాబీ దళాధిపతి, సీఎం కేసీఆర్‌ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ రోజు జ‌రిగిన‌ కరీంనగర్‌ సభలో కూడా తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని తేల్చి చెప్పిన నేప‌థ్యంలో కేంద్ర రాజకీయాల్లో చురుకుగా ఉండేలా అడుగులు వేస్తు . ఏపీలో వైసీపీకి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తు, ఎన్నికల్లో జగన్‌కు ఆర్ధికంగా సాయం అందిస్తున్న‌ట్టు న్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.    ఏపిలో జగన్‌ పార్టీ గణనీయంగా సీట్లు గెలిస్తే వాళ్లతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలన్న‌ది కేసీఆర్‌ యోచన‌.


 నిజానికి  కేసీఆర్‌ ప్రయత్నాలకు కొద్దిరోజులుగా మోదీ అడ్డుపడుతున్నందునే హ‌డావిడి సమావేశాలు మిన‌హా ఏం జ‌ర‌గ‌టంలేద‌న్న ప్ర‌చారంసాగుతున్న త‌రుణంలో హైదరాబాద్‌ స్థానానికి పోటీ పెట్టడం లేదని ప్రకటించిన కేసీఆర్‌ ఇంకా 9 మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించినా మిగిలిన  ఆరు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. కొందరు సిట్టింగ్‌లకు ప్రచారం చేసుకోవాలని గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇచ్చారు కూడా అయితే  త‌న‌కు క‌ల‌సివ‌చ్చిన క‌రీంన‌గ‌ర్ లేదా మెద‌క్‌ల నుంచి కానీ రంగంలోకి దిగాల‌ని ఆయ‌న‌భావిస్తుంటే, ఇప్ప‌టికే మ‌ల్క‌జ‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా బ‌రిలో ఉన్న రేవంత్ రెడ్డిని ఓడించాలంటే అక్క‌డ పోటీకి దిగాల‌ని కొంద‌రు కోరుతున్నారు.  అయితే సికింద్రాబాద్ నుంచి   పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM