ఏప్రిల్ 25 నుంచి జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు

byసూర్య | Sat, Mar 16, 2019, 10:11 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ క్రీండాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన వేసవి శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంపు) ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బల్దియాకు చెందిన వివిధ ఆట మైదానాలు, కాంప్లెక్స్‌లలో వివిధ రకాల క్రీడాంశాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తారు. అలాగే, నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూళ్లను ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించాలని నిర్ణయించారు.ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణను వివిధ ప్రాంతాల్లోని బల్దియా క్రీడా మైదానాలు, క్రీడా కాంప్లెక్స్‌లలో సుమారు 51 క్రీడాంశాల్లో ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లతో నిర్వహించే శిక్షణ శిబిరాల్లో ఆరు సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిభిరాల ద్వారా ఇప్పటివరకు 33లక్షల మందికి పైగా బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిచ్నిట్లు, శిక్షణ తీసుకున్నవారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేకున్నవారు ఎందరో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ నుంచి బ్యాడ్మింటన్‌లో ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి.సింధు వరకు ఎంతో మంది జీహెచ్‌ఎంసీ క్రీడా మైదానాల ద్వారా ఎదిగినవారేనని వారు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ప్రస్తుతం 521 క్రీడా మైదానాలు, 7స్విమ్మింగ్ పూల్‌లు, 18 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 7రోలర్స్ స్కేటింగ్ రింగులు, 5 టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. పలు ఆట మైదానాల్లో ప్రతినెలా ఒక్కో క్రీడపై ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహిస్తారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపికచేసి వారిని ప్రత్యేక టీంగా తయారు చేస్తారు. వారిని స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పంపుతారు. 


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM