59 ఓట్లు సాధించి సర్పంచ్ అయ్యాడు..

byసూర్య | Mon, Jan 21, 2019, 04:36 PM

జగిత్యాల : ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఎందుకంటే కేవలం 51 ఓట్లు సాధిస్తే సర్పంచ్ పదవి దక్కినట్లే. అయితే సర్పంచ్ పదవికి ఇద్దరు వ్యక్తులు పోటీ పడగా.. అందులో ఒకాయన 59 ఓట్లు సాధించి సర్పంచ్ పదవికి అర్హత పొందాడు. 106 ఓటర్లున్న ఆ గ్రామపంచాయతీ చిన్న కొల్వాయి. తెలంగాణలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన చిన్న కొల్వాయి జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలో ఉంది. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి చిక్రం రవీందర్ తన ప్రత్యర్థి చిక్రం బుచ్చి రాములుపై గెలుపొందాడు. పోలైన 92 ఓట్లకు గానూ చిక్రం రవీందర్ 59 ఓట్లు సాధించాడు. మొత్తం 106 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 50, మహిళలు 56 మంది ఉన్నారు. నాలుగు వార్డులున్నాయి. మొత్తం జనాభా 162.


 


 


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM