NTR 30 మరింత ఆలస్యం కాబోతుందా..?

by సూర్య | Tue, Jan 31, 2023, 10:07 AM

జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మళ్ళీ వీరి కలయికలో రెండో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అదీగాక, RRR గ్లోబల్ సక్సెస్ తదుపరి తారక్, ఆచార్య భారీ డిజాస్టర్ తదుపరి కొరటాల నుండి రాబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ లో ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


ప్రస్తుతానికైతే, ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అలానే వచ్చే నెల నుండి షూటింగ్ మొదలెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది. RRR ఆస్కార్ నామినేషన్ పొందడంతో, టీం అంతా కలిసి మరోసారి US వెళ్లి అక్కడ ప్రచారం చెయ్యాలని చూస్తుందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 మూవీ పట్టాలెక్కేందుకు ఇంకా రెండు నెలల సమయం పట్టొచ్చని తెలుస్తుంది. మరి, టీం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే ఆలస్యం.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM