'హంట్' డిజిటల్ స్ట్రీమింగ్..రెండు వారాలకేనా..?

by సూర్య | Tue, Jan 31, 2023, 10:32 AM

నైట్రో స్టార్ సుధీర్ బాబు 'హంట్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు జనవరి 26నుండి థియేటర్లలో సందడి చెయ్యడం ప్రారంభించాడు. ఇలాంటి సినిమా చేసినందుకు సుధీర్ బాబు ధైర్యానికి అందరినుండి ప్రశంసలు వస్తున్నాయి కానీ, బొమ్మ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చెయ్యలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల హంట్ అంతగా కొనసాగలేదు.


దీంతో మేకర్స్ హంట్ మూవీని రెండు వారాలకే డిజిటల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ వీడియోలో హంట్ సందడి మొదలుకానుంది. ఐతే, ఫ్యూచర్లో, ఈ డేట్ లో మార్పులు ఏమన్నా ఉంటాయేమో తెలియదు.  


మహేష్ సూరపనేని డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM