'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్

by సూర్య | Sat, May 04, 2024, 08:22 PM

మారుతీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.  ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మే 5, 2024న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ మారుతీ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, యు అండ్  ఐ హలో వరల్డ్ వంటి అనేక విజయవంతమైన వెబ్ షోలను అందించిన నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'షరతులు వ‌ర్తిస్తాయ్' Sat, May 18, 2024, 03:23 PM
రత్నం నుండి 'ప్రాణం నా ప్రాణం' వీడియో సాంగ్ రిలీజ్ Sat, May 18, 2024, 03:21 PM
రజాకార్ నుండి 'భారతి భారతి ఉయ్యాలో' వీడియో సాంగ్ అవుట్ Sat, May 18, 2024, 03:18 PM
'కల్కి 2898AD' నుండి భైరవ బుజ్జి విడుదలకి టైమ్ లాక్ Sat, May 18, 2024, 03:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'విరూపాక్ష' Sat, May 18, 2024, 02:58 PM