'ఫన్' టాస్టిక్ ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

by సూర్య | Fri, May 20, 2022, 03:11 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లబ్ డబ్ డబ్బో, ఊఁ ఆఁ ఆహా ఆహా, లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా అనే పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇందులో గ్లామర్ బ్యూటీ పూజాహెగ్డే ఐటెం సాంగ్ చేస్తుంది. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత పూజా ఐటెం సాంగ్  చేస్తున్న చిత్రమిదే. 


తాజాగా ఎఫ్ 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నిర్మాతలు అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 21వ తేదీన, హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో సాయంత్రం ఆరు గంటల నుండి ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని తెలిపే అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఎఫ్ 2 కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మే 27న విడుదలవబోతున్న ఈ చిత్రం ఆ అంచనాలకు ధీటుగా ఉంటుందో లేదో చూడాలి.

Latest News
 
అందుకే మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్న : మృణాల్‌ ఠాకూర్‌ Tue, Apr 30, 2024, 01:47 PM
బ్లాక్ శారీలో మాళవిక ఫోజులు Tue, Apr 30, 2024, 01:42 PM
ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్ Tue, Apr 30, 2024, 10:54 AM
ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ Tue, Apr 30, 2024, 10:37 AM
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM